navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 3:27 am Digital Edition : NAVAGEETAM

మొబైల్‌లో సిమ్ లేకపోతే.. వాట్సాప్ పనిచేయదు

ఎల్లుండి నుంచి కొత్త రూల్ అమలు

నవగీతం, హైదరాబాద్:(టెక్నాలజీ)

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28వ తేదీ తర్వాత సిమ్‌ లేకుండా వాట్సాప్‌ పనిచేయదు. వాట్సాప్‌ వాడాలంటే సిమ్‌ తప్పనిసరిగా ఉండాలంటూ జారీచేసిన ‘సిమ్‌ అనివార్యం’ నిబంధనకు ఫిబ్రవరి 28 డెడ్‌లైన్‌గా కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ డెడ్‌లైన్‌ను పొడిగించబోమని కేంద్రం స్పష్టంచేసింది. జాతీయ భద్రతకు, సైబర్‌ నేరగాళ్ల నుంచి యూజర్లను కాపాడేందుకే వీటిని అమలులోకి తెస్తున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం వాట్సాప్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌, స్నాప్‌చాట్‌, షేర్‌చాట్‌, జియోచాట్‌, అరాటై, జోష్‌ లాంటి సామాజిక మాధ్యమాల వినియోగానికి మొబైల్‌ ఫోన్‌లో తప్పనిసరిగా సిమ్‌ ఉండాల్సిందే.