navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 5:41 pm Digital Edition : NAVAGEETAM

మొరపెల్లిలో ఘనంగా మడలేశ్వర స్వామి బోనాల వేడుకలు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల రూరల్ మండలం మొరపెల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మడలేశ్వర స్వామి బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించగా గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ గంగరాజం, వార్డు సభ్యులు తిరుపతి రెడ్డి, నాయకులు రాము, రాజిరెడ్డి, దేవన్న, గంగాధర్, అమర్, గంగారావు, లక్ష్మణ్ ,రజక సంఘం సభ్యులు కొత్తకొండ లింగయ్య, గంగన్న, రాజు, నారాయణతో పాటు రజక యూత్ నాయకులు కొత్తకొండ సతీష్, వడ్లూరి ప్రశాంత్, మహేష్, సురేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.