యాభై మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 2.5 కోట్ల ఎక్స్ గ్రేషియా మంజూరు
ప్రభుత్వం వరమిచ్చినా.. అధికారుల అలసత్వంతో జాప్యం నవగీతం,హైదరాబాద్: జగిత్యాల జిల్లాకు చెందిన 50 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలు, రూ.5 లక్షల చొప్పున గల్ఫ్ ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయానికి అర్హులని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా నివేదికలు పంపారు. పాస్‌పోర్టు, మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, బ్యాంక్ ఖాతా వంటి పత్రాల సేకరణను మండల తహసీల్దార్ ల ద్వారా వేగంగా పూర్తి చేయించి, దరఖాస్తుల పరిశీలనను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ను పలువురు అభినందిస్తున్నారు....