యువజన సంఘాల ఆధ్వర్యంలో వివేకానంద జయంతి
నవగీతం,కథలాపూర్ కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో సోమవారం రోజున యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన యోగి అని,తన ఉపన్యాసాల ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన మహనీయుడని కొనియాడారు. పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన తొలి హిందూ ఆధ్యాత్మికవేత్త కావడం విశేషమని తెలిపారు.ఇనుప కండరాలు, ఉక్కునరాలు, వజ్రసంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం...