యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుకు రావాలి:ఎమ్మెల్యే సంజయ్
నవగీతం, మల్లాపూర్ మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన యం పి ఎల్-4 క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫైనల్ మ్యాచ్‌లో పోటీపడి విజయం సాధించిన విన్నర్ టీమ్, అలాగే ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచిన రన్నర్-అప్ టీమ్‌లకు ఎమ్మెల్యే సంజయ్ బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని, ఐక్యతను పెంపొందించడంలో...