రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
యూరియా పంపిణీ పకడ్బందీగా చేయాలి నవగీతం,ఖమ్మం: రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో రబీ ధాన్య సేకరణ, యూరియా పంపిణీ, మునిసిపల్ ఎన్నికలు, జిల్లా అధికారుల హాజరు లపై అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రబీ సీజన్ దిగుబడి అంచనాలకు తగ్గట్టు కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.గత...