రాజకీయ సంస్కృతిని ఖూనీ చేస్తున్న అంబటి
టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి నవగీతం,పెద్దపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ అడక్ కమిటీ మెంబర్,జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి పాల్గొని,అంబటి రాంబాబు తీరును ఎండగట్టారు.ఈ సందర్భంగా అక్కపాక తిరుపతి మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు,ప్రతివిమర్శలు సహజమని,కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి అంబటి రాంబాబు వాడిన భాష...