రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీల్లో పెద్దపల్లి జట్టు ఘనత
రన్నరప్‌గా నిలిచిన జిల్లా జట్టు నవగీతం,పెద్డపల్లి: నారాయణపేట జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖో-ఖో టోర్నమెంట్‌లో పెద్దపల్లి జిల్లా జట్టు చారిత్రక విజయం సాధించి రాష్ట్రస్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టుపై ఘనవిజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్న పెద్దపల్లి, ఆదిలాబాద్ జట్టుతో జరిగిన హోరాహోరీ పోరులో పోటాపోటీగా ఆడి రన్నరప్‌గా నిలిచింది. జిల్లాలో నూతన అసోసియేషన్ ఏర్పాటైన ఏడాది తిరగకముందే,సీనియర్స్ రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఇప్పుడు సబ్ జూనియర్స్‌లో రెండో స్థానం సాధించడం పట్ల...