navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 1:11 pm Digital Edition : NAVAGEETAM

రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులకు విప్పలమడక సర్పంచ్ ఎంపిక

ఉత్తర్వులు మంజూరు చేసిన డిపిఓ

నవగీతం, వైరా ప్రతినిధి:

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ భవన్ లో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి మహిళా గ్రామ పంచాయితీ సర్పంచ్ల శిక్షణా తరగతులకు వైరా మండలంలోని విప్పలమడక గ్రామ సర్పంచ్ మేడా హేమిమా చక్రపాణిని జిల్లా పంచాయతీ రాజ్ అధికారులు ఎంపిక చేశారు. ప్రతి జిల్లా నుంచి నలుగురు మహిళా సర్పంచులను ఈ శిక్షణా తరగతులకు ఆహ్వానం అందిస్తున్నారు. అందులో భాగంగా గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న విప్పలమడక సర్పంచిని ఈ శిక్షణ తరగతులు కు ఎంపిక చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి టి.రాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక పాలనలో మహిళా సాధికారత అనే అంశంపై ఐదు రోజులపాటు శిక్షణను ఇవ్వనున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలంలోని జీకే బంజర సర్పంచ్ ఎం.జ్యోతి, చింతగుర్తి టీ.ప్రియాంక, కొణిజర్ల మండలం మేకాలకుంట గ్రామ సర్పంచ్ బి.అనితలను ఈ తరగతులకు ఎంపిక చేశారు