రాష్ట్ర బడ్జెట్‌పై ఏబీవీపీ నిరసన

స్కాలర్షిప్ కోసం కొత్త బస్టాండ్ వద్ద ధర్నా నవగీతం, జగిత్యాల ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యా రంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణ కాలేజ్ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొత్త బస్టాండ్ సర్కిల్ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు.నిరసనలో భాగంగా విద్యార్థులు పట్టణ ప్రధాన రహదారిపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు....