రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్ పోటీలకు బీర్పూర్ విద్యార్థిని జావళి ఎంపిక
నవగీతం, జగిత్యాల/బీర్పూర్: జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్ పోటీల్లో బీర్పూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ కి చెందిన 9వ తరగతి విద్యార్థిని జావళి అద్భుత ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యింది. వివిధ పాఠశాలల నుండి తరలివచ్చిన విద్యార్థులతో హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో, జావళి తన అనర్గళ ప్రసంగంతో, అంతర్జాతీయ నిబంధనలపై ఉన్న అవగాహనతో నిర్ణేతలను మెప్పించారు.ప్రస్తుత సామాజిక అంశాలపై సభలో ఒక బాధ్యతాయుతమైన క్యూబా ప్రజాప్రతినిధిలా తన గళాన్ని వినిపించి, తర్కబద్ధమైన వాదనలతో...