రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ ఒగ్గు వైభవం

ఢిల్లీ పరేడ్‌కు పెద్దపల్లి కళాకారుడు శివయ్య ఎంపిక నవగీతం, పెద్దపల్లి ఢిల్లీలో ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ జానపద కళా వైభవం ప్రతిబింబించనుంది. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన 30 మంది ఒగ్గుడోలు కళాకారుల బృందంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లి గ్రామానికి చెందిన బొప్పనపల్లి శివయ్యకు చోటు దక్కింది. జనగామ జిల్లా మాణిక్యపురం గ్రామానికి చెందిన డాక్టర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్...