రీ–సర్వేను అత్యంత పారదర్శకంగా,పకడ్బందీగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

జగిత్యాల,ఆగస్టు28,(నవగీతం): జిల్లాలో చేపట్టిన గ్రామాల రీ–సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దేశిత కార్యాచరణ ప్రకారం అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని తహసీల్దార్లు, గిర్దావర్లు, గ్రామ పాలనాధికారులకు గ్రామాల రీ–సర్వే ప్రక్రియపై సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రీ–సర్వే ద్వారా గ్రామాల్లోని ప్రతి భూ కమతాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖచ్చితంగా కొలిచి, భూ రికార్డులను నవీకరించడం జరుగుతుందని తెలిపారు. భూ యజమానుల హక్కుల...