రీ సర్వే పనులను పకడ్బందీగా,వేగవంతంగా పూర్తి చేయాలి:కలెక్టర్ బి. సత్యప్రసాద్
నడికుడ గ్రామంలో నాన్ కెడస్ట్రాల్ రిసర్వే, ఎంజాయ్మెంట్ రీ సర్వే పనుల పరిశీలన జగిత్యాల/మల్లాపూర్: మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలో నాన్ కెడస్ట్రాల్ రీసర్వే, ఎంజాయ్ మెంట్ రీ సర్వే పనులను సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రీ సర్వే ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటివరకు ఎంత విస్తీర్ణంలో రీ సర్వే పూర్తయింది, ఇంకా ఎంత మేర చేపట్టాల్సి ఉంది, పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతాయనే వివరాలను...