navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 3:28 pm Digital Edition : NAVA GEETAM

రూ.3.35 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, అక్టోబర్7,(నవగీతం)

చొప్పదండి మండలంలోని కొలిమికుంట నుంచి మల్లికార్జున స్వామి ఆలయం మీదుగా మల్లన్నపల్లె వరకు రూ.3.35 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్డుకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం కొలిమికుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అలాగే మండలంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో నిలబెడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, సింగిల్ విండో చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, కొలిమికుంట గ్రామ సర్పంచ్ చొక్కల్ల తిరుపతి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ పంజాల లక్ష్మణ్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ నెరువట్ల మల్లేశం, సత్తు శ్రీనివాస్, ఆకుల సురేష్, చొక్కల్ల కనకయ్య, పట్టణ శాఖ అధ్యక్షుడు, సింగిల్ విండో వైస్ చైర్మన్ నిజానపురం చందు తదితరులు పాల్గొన్నారు.

అలాగే వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, మున్సిపల్ పాలకవర్గం, సింగిల్ విండో పాలకవర్గం, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.