రూ.3.35 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి, అక్టోబర్7,(నవగీతం) చొప్పదండి మండలంలోని కొలిమికుంట నుంచి మల్లికార్జున స్వామి ఆలయం మీదుగా మల్లన్నపల్లె వరకు రూ.3.35 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్డుకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కొలిమికుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అలాగే మండలంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణ లక్ష్మి...