navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 8:10 am Digital Edition : NAVA GEETAM

రెండు బైక్ లు ఢీ…విద్యుత్ శాఖ జూనియర్ ఆసిస్టెంట్ మృతి 

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 28(నవగీతం)  ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన బోయినపల్లి అశోక్,(44) మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెట్ పల్లి విద్యుత్ శాఖ లో జూనియర్ ఆసిస్టెంట్ గా పనిచేస్తున్న బోయినపల్లి అశోక్, అతని స్నేహితుడు బుల్లి శంకర్, తో కలిసి ఆదివారం మోటర్ సైకిల్ పై వెనుకాల కూర్చుని విట్టెంపేట్ వైపు నుండి బండలింగపూర్ వెళుతుండగా సాయంత్రం 5:30గం,సమయంలోబండలింగపూర్ గ్రామ శివారులోని సబ్ స్టేషన్ దగ్గర వారు ప్రయాణిస్తున్న బండికి ఎదురుగా వస్తున్న బజాజ్ పల్సర్ మోటర్ సైకిల్ డ్రైవర్ ఆత్మనగర్ గ్రామానికి చెందిన దొంత శ్రీకాంత్, అనే వ్యక్తి అతివేగంగా డికొట్టాడంతో  మోటర్ సైకిల్ వెనుకాల కూర్చున్న అశోక్ కింద పడటంతో తలకి బలమైన గాయం కావడంతో అశోక్, ని హుటాహుటిన మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స చేపిస్తుండగా సోమవారం ఉదయం సుమారు 11:55 గం, సమయంలో అశోక్ మరణించినట్లుగా డాక్టర్లు ధ్రువీకరించారని మృతుడి సోదరుడు బోయినపల్లి శ్యామ్ ( సామ్రాట్ )పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి నవీన్ కుమార్ తెలిపారు.