రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ నవగీతం, సూర్యాపేట: మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో వసతి, సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం బాలికల రెసిడెన్షియల్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని డైనింగ్ హాల్, స్టోర్ రూమ్,కిచెన్ షెడ్, లైబ్రరీ, కలెక్టర్ పరిశీలించారు. కిచెన్ రూమ్ లో విద్యార్థులకు వడ్డించుటకు తయారుచేసిన భోజనం, పప్పు, కూరలు, సాంబారు పరిశీలించారు,...