రేకుర్తి–విద్యానగర్ భూ బాధితుల (ధర్నా ) సమావేశం
నవగీతం,కరీంనగర్ : కరీంనగర్ లోని శాతవాహణ యూనివర్సిటీ చౌరస్తా వద్ద రేకుర్తి, విద్యానగర్ భూ బాధితుల ధర్నా సమావేశం ఆదివారం నిర్వహించారు. రేకుర్తి, శ్రీరామ్‌నగర్ కాలనీ, కొత్త యాస్వాడ, ఆదిత్యానగర్, సాలేనగర్, విద్యానగర్ ప్రాంతాలకు చెందిన కొంత భాగం పట్టా భూములను ప్రభుత్వం నిషేధిత జాబితా (22–ఏ)లో చేర్చిన నిర్ణయానికి నిరసనగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోయిన భూ బాధితులు సుమారు 80 మంది ఈ సమావేశంలో పాల్గొని తమ ఆందోళనను వ్యక్తం చేశారు. భూ సమస్యను వెంటనే...