navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 12:55 pm Digital Edition : NAVAGEETAM

రేషన్ డీలర్ల సంఘం ఏకగ్రీవం

అధ్యక్షులుగా దప్పుల నరసయ్య

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామంలో మండల రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మల్లాపూర్ మండల నూతన డీలర్ల సంఘం కమిటీ ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ముద్దం ప్రకాష్, అధ్యక్షులుగా దప్పుల నర్సయ్య, ఉపాధ్యక్షులుగా ఇస్లావత్ విజయ, కోశాధికారిగా కల్లేడ లలిత, ప్రధాన కార్యదర్శిగా గుండు మహిపాల్, కార్యదర్శిగా వెంకట్ లను డీలర్ల అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డీలర్స్ అధ్యక్షులు దప్పుల నర్సయ్య మాట్లాడుతూ డీలర్ల సమస్యలకు ఎల్లవేళలా అండగా ఉంటానని డీలర్ల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. ఈ అవకాశం కల్పించిన రేషన్ డీలర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.