navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 4:43 am Digital Edition : NAVAGEETAM

రేసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

 

నవగీతం, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్‌చంద్ కళ్యాణ మండపంలో నిర్వహించిన పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో 2026-28 రెండేళ్ల కాల పరిమితికి గాను నూతన కార్యవర్గాన్ని బుదవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అసోసియేషన్ అధ్యక్షులుగా మెతుకు తిరుపతి,ఉపాధ్యక్షులుగా నీలం నరేందర్, తాళ్ళ నరేందర్,ప్రధాన కార్యదర్శిగా సట్టు కనకయ్య,ఆర్థిక కార్యదర్శిగా కర్రె ప్రవీణ్‌,ప్రచార కార్యదర్శిగా అలుగం కనకయ్య, గౌరవ అధ్యక్షులుగా వాలుక హనుమంతు, గౌరవ సలహాదారుగా చాట్ల ఆగయ్య, కార్యవర్గ సభ్యులుగా ఒల్లే శ్రీనివాస్ యాదవ్,రామగిరి స్వామి,వడ్డేపల్లి రాజేషం,కర్నె రాజు,సుంకే నర్సింగంలు నియమితులయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మెతుకు తిరుపతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.పెద్దపల్లిలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయులందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి,వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన ప్రకటించారు.ఈ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల అధికారి హనుమంత్ కు,సహకరించిన పెద్దలకు,కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు ఉపాధ్యాయులు పూలమాలలు వెసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.