రైతులకు పంటల వైవిధ్యీకరణ పై అవగాహన

నవగీతం,కొడిమ్యాల : కొడిమ్యాల మండలం రామకిష్టాపూర్ గ్రామంలో శనివారం రైతులు పంట మార్పిడి విధానం పాటించడంతో పాటు సంప్రదాయ ఎరువులను వినియోగించి పర్యావరణాన్ని సంరక్షించాలని సూచిస్తూ రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ , కరీంనగర్‌కు చెందిన వ్యవసాయ కళాశాల విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా పీఆర్‌ఏ (పార్టిసిపేటరీ రూరల్ అప్రైసల్ ) కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా సామాజిక పటం, వనరుల పటం, సమస్యల చెట్టు, సంపద ర్యాంకింగ్, గ్రామ జనాభా పటం వంటి...