రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

నిర్వాహకులు త్వరితగతిన కొనుగోళ్ళు పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల రూరల్ మండలం లోని చల్ గల్, తాటిపెల్లి గ్రామాల్లో  ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా,వేగంగా కొనుగోలు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం స్వీకరణ పరిస్థితిని ,తూకం విధానాన్ని ,17% తేమ శాతం నిర్వహణను మరియు కేంద్రల వద్ద వసతులను...