రైతు ముంగిట సంక్రాంతి వైభవం

రాఘవపూర్ లో కన్నుల పండువగా కాట్రేవుల పండుగ నవగీతం,పెద్దపల్లి పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం భోగి పండుగను పురస్కరించుకుని గ్రామంలో పురాతన కాలం నుండి వస్తున్న ఆచారాలను కొనసాగిస్తూ ఎద్దుల పోటీలు మరియు కాట్రేవుల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో,ఉత్సాహంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తడిచెట్టి చామంతి-శ్రీకాంత్ ఎద్దుల పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ మన పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రతి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గ్రామంలోని పాడి పశువులన్నీ ఆయురారోగ్యాలతో ఉండాలని,...