రైతు వారోత్సవంలో వ్యవసాయ శాఖ- ఉద్యాన శాఖ రైతు అవగాహన సదస్సు
నవగీతం :వైరా ప్రతినిధి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ -ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల ప్రాధాన్యం మరియు ఆదాయ వృద్ధి అవకాశాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.ఈ సదస్సులో ముఖ్యంగా ఉద్యాన పంటల సాగు విస్తరణ, ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం, అలాగే...