navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 5:33 pm Digital Edition : NAVAGEETAM

రైతు వేదికలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

నవగీతం,వేల్పూర్ ప్రతినిధి:

వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో రైతు వేదికలో సుస్థిర వ్యవసాయ కేంద్రం వారి ఆధ్వర్యంలో సుస్థిర వ్యవసాయంపై అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేంద్రీయ వ్యవసాయం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని రైతులకు వివరించారు. అనంతరం క్షేత్ర సందర్శనలో భాగంగా శబరిష్ డైరెక్ట్ సీడెడ్ రైస్ వరి పొలాన్ని సందర్శించి, ఈ విధానం ద్వారా కూలీల ఖర్చులు తగ్గడం, నాట్ల పద్ధతితో పోలిస్తే సమయానికి పంట కోత సాధ్యమవడం, విత్తన ఖర్చు తగ్గడం వంటి ప్రయోజనాలను తెలియజేశారు. అలాగే నూకలు (బ్రోకెన్ రైస్) చల్లిన రాజేష్ వరి పొలాన్ని సందర్శించి, ఈ పద్ధతి ద్వారా కలుపు మొక్కల నియంత్రణ సాధ్యమవడం, గడ్డి మందుల వినియోగం తగ్గడం, వానపాముల సంఖ్య పెరగడం, నేల సారవంతత మెరుగుపడడం వంటి ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి బి. రాజు, ఆర్టికల్చర్ ఆఫీసర్ రాజా గౌడ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సాయిరాం, రాజు సర్పంచ్ రాజు , అగ్రోనమిస్ట్ శివ సాయి కృష్ణ, భార్గవ్, సీఆర్పీ చింత శ్రీనివాస్, శ్రీకాంత్ ,రవి , వెస్లీ గ్రామ రైతులు రాజేష్ గంగారం నరేందర్ గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .. ఈ కార్యక్రమం ద్వారా రైతులు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై మరింత అవగాహన పొందారు.