రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం:మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కోరుట్లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్,కలెక్టర్ బి.సత్యప్రసాద్ నవగీతం, కోరుట్ల ప్రతినిధి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో, మార్క్‌ఫెడ్ సహకారంతో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా...