navageetam.com
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 11:42 am Digital Edition : NAVAGEETAM

రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి.. కలెక్టర్ బి.సత్య ప్రసాద్

నవగీతం,మెట్ పల్లి:

మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు,మందుల లభ్యత, పరిశుభ్రత పరిస్థితులు, సిబ్బంది హాజరు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.

వార్డులు, ఔషధ నిల్వ గదులను తనిఖీ చేసి రోగులకు అవసరమైన మందులు తగినంతగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా వైద్యులు మరియు సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.