రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన పట్టణ సీఐ కరుణాకర్
“చదువుకుంటారా.. చదివిస్తా” అంటూ ఆప్యాయంగా పలకరింపు జగిత్యాల, అక్టోబర్6,(నవగీతం) చేతుల్లో పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లాల్సిన చిన్నారులు.. బిక్షాపాత్రలు పట్టుకుని రోడ్డుపై నిల్చున్న దృశ్యం జగిత్యాల పట్టణంలో కలచివేసింది. ఎండను సైతం లెక్కచేయకుండా తల్లిదండ్రులతో కలిసి భిక్షాటన చేస్తున్న నాలుగైదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను చూసిన జగిత్యాల పట్టణ సీఐ కరుణాకర్ చలించిపోయారు. విధులకు వెళ్తున్న సమయంలో తహసీల్ చౌరస్తా వద్ద ఈ దృశ్యం ఆయన దృష్టికి రావడంతో వెంటనే వాహనాన్ని ఆపి చిన్నారుల వద్దకు వెళ్లారు. చిన్నారులను ఆప్యాయంగా చేరదీసిన సీఐ కరుణాకర్...