రోడ్డుపై వర్షపునీరు. వాహనదారులకు ఇబ్బందులు!

మల్లాపూర్,నవంబర్04, (నవగీతం): మల్లాపూర్ మండలంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లపై వరదనీరు చేరింది. మండలకేంద్రంలోని నందివిగ్రహం వద్ద రోడ్డుపై వర్షపునీరు నిల్వ ఉండి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. వర్షం కురిసిన ప్రతిసారి నీరు బయటికి వెళ్లిపోవడానికి మార్గంలేక రోడ్డుపైనే నిలుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపునీరు పక్కన ఉన్న డ్రైనేజీలోకి వెళ్లేలా చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామస్తులు, వాహనదారులు కోరారు.