navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 9:19 pm Digital Edition : NAVAGEETAM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

నవగీతం వైరా ప్రతినిధి:

వైరా పట్టణ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు అవడంతో 108 ద్వారా ఆసుపత్రి తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా వైరా మండలంలోని ముసలిమడుగు గ్రామానికి చెందిన వేల్పుల చందు ఖమ్మం క్యాటరింగ్ పని నిమిత్తం వెళ్తున్న క్రమంలో మహాలక్ష్మి అమ్మ దేవాలయం నుండి రోడ్డు దాటుతున్న స్కూటీ ,ద్విచక్ర వాహనదారుడుని వేగంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో వేల్పుల చందు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేల్పుల చందు (16).కుటుంబ సభ్యుల సహకారంతో మృతిని కళ్ళను ఖమ్మం ఐ కేర్ కు దానం చేశారు.సంఘటన స్థలాన్ని పరిశీలించిన వైరా ఎస్సై పుష్పాల రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.