రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో “Arrive Alive”

నవగీతం,జగిత్యాల రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో “Arrive Alive” కార్యక్రమాన్ని ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజలందరికీ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్...