రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

నవగీతం, జగిత్యాల జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ ప్రాంతంలో ఉన్న శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీట్‌బెల్ట్, హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగం ప్రమాదాలకు...