navageetam.com
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 1:49 pm Digital Edition : NAVAGEETAM

లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత పంచమి వేడుకలు

నవగీతం,కొడిమ్యాల.

కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ధైవా ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమి లేదా శ్రీ పంచమిగా పిలుస్తారు. ఈ రోజుతో వసంత ఋతువు ప్రారంభమవుతుందని శాస్త్రోక్తంగా భావిస్తారు.వసంత పంచమి సందర్భంగా సరస్వతి మాత జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నాగరాజు రమేష్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.