navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 2:30 pm Digital Edition : NAVAGEETAM

లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలి.

నవగీతం,ఇల్లంతకుంట,

నర్సరీలో మొక్కలు పెంపకంలో జాగ్రత్తలు పాటించి, అనుకున్న లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలని సర్పంచ్ మామిడి రాజు అన్నారు. మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీలో 15వేల మొక్కల పెంపు కార్యక్రమాన్ని సర్పంచ్ మామిడి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం పచ్చదనంతో కళకళలాడాలని, పర్యావరణ సమతుల్యత కోసం మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యత అని అని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ కూనబోయిన వేణు, వార్డు సభ్యులు మామిడి సుశీల, చేరాల వంశీ, రాకం సుమన్, అంతటి శ్రీకాంత్, కూనబోయిన ఎల్లవ్వ, మాజీ వార్డు సభ్యులు గడ్డం రమాదేవి- రవీందర్, నాయకులు ఒగ్గు రమేష్, కొట్టె వెంకన్న, అవారు బాలయ్య, ఎర్రోజు రవితేజ, దయ్యాల మహేష్, యువజన సంఘాల నాయకులు గడ్డం మహేందర్, ఎర్రోజు సంతోష్,రాము, ఉపాధి హామీ కూలీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.