లగ్జరీ మాయలో మిడిల్ క్లాస్: అప్పు, ఆర్థిక అస్థిరత

నవగీతం,హైదరాబాద్: ఒకప్పుడు భారతీయ మిడిల్ క్లాస్ విజయానికి నిర్వచనం..స్థిరమైన ఉద్యోగం, స్వంత ఇల్లు, పిల్లల విద్య, కొంత బంగారం, భవిష్యత్తు కోసం పొదుపు. ఇప్పుడు అదే విజయానికి కొత్త నిర్వచనం..ప్రీమియం ఫోన్, పెద్ద కారు, విదేశీ ట్రిప్, బ్రాండెడ్ జీవనశైలి, సోషల్ మీడియాలో “పర్ఫెక్ట్ లైఫ్” ప్రదర్శన. ఈ మార్పు కేవలం అభిరుచిలో వచ్చిన పరిణామం కాదు; ఇది భారత ఆర్థిక నిర్మాణంలో నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక పెద్ద సామాజిక-ఆర్థిక మార్పు. “ముందు పొదుపు, తర్వాత ఖర్చు” అన్న సంప్రదాయ ఆలోచన స్థానంలో ఇప్పుడు...