శ్రీ కనక సోమేశ్వర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
నవగీతం,మల్లాపూర్:
మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు అధ్యక్షులు రేవెల్లి తిరుపతి తెలిపారు. సిరిపూర్ గ్రామానికి చెందిన లయన్స్ క్లబ్ కోశాధికారి కళ్లెం నాగేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరానికి సుమారు 250 మంది చికిత్సకు రాగా 60 మందిని కంటి ఆపరేషన్ కు పంపినట్లు తెలిపారు. పేద ప్రజల పక్షాన నిలబడే లయన్స్ క్లబ్ ఎల్లప్పుడు గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎల్లాల జలపతి రెడ్డి, అధ్యక్షులు రేవెల్లి తిరుపతి, కార్యదర్శి మండ స్వామి, కోశాధికారి కళ్లెం నాగిరెడ్డి, మెట్ పల్లి అధ్యక్షులు శ్రీనివాసరావు, సర్పంచ్ పెంట సౌజన్య శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు మాట్ల సోమయ్య, నాయకులు మరిపెళ్లి మల్లయ్య, కోటగిరి ఆనంద్ సోమారెడ్డి లక్ష్మారెడ్డి, సోమారెడ్డి గడ్డం లక్పతి రెడ్డి బాపురెడ్డి నల్ల ప్రవీణ్ ఏనుగు మాధవరెడ్డి మిల్క్ నవీన్, గంధాల శివప్రసాద్ ,మాధవ్ నల్ల ప్రవీణ్ ,సోమలింగారెడ్డి, నోముల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు..
