navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 8:29 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వనమహోత్సవం లో చెట్లు నాటిన ప్రజాప్రతినిధులు

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండల కేంద్రం లో డి.ఆర్.డి.ఓ పి.డి రఘు వరణ్ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమం మల్లాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ నాటుదాం ఒక చెట్టు -అమ్మ పేరు మీద అని అందరి చేతా నినాదం అనిపిస్తూ చెట్లు, అడవులను సంరక్షించడానికి పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి ఏటా వర్షాకాలంలో నిర్వహించే ఒక గొప్ప ఉద్యమమే వనమహోత్సవం. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ మరియు ప్రజలలో చెట్ల ఆవశ్యకతను తెలియజేయడమే ఈ ఉత్సవ ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు.ఈ కార్యక్రమం లో ఎం.పి.డి.ఓ అలువాల శ్రీకాంత్,ఎం.పి.ఓ మహేశ్వర్ రెడ్డి,ఏ.పి.ఓ సతీష్ కుమార్, ఏ.పి.ఎం విమోచన,ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, కార్యదర్శి గూరుడు శ్రీనివాస్,గ్రామ సమైక్య సిబ్బంది కృష్ణవేణి, వసంత, రోజా, నర్మద, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్,ముష్కరి రమేష్, అరికుప్పల రాజం, కాషవత్తుల గంగా రెడ్డి, ముత్యాల గంగా రాజం,కదుర్క లక్ష్మి -రాజేందర్,అల్లె లత -చంద్రయ్య,ఏనుగు లక్ష్మి, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.