వయోవృద్ధుల హక్కులను,బాధ్యతలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం :మంత్రి అడ్లూరి

వయోవృద్ధుల సదన్ ప్రారంభించిన ప్రముఖులు నవగీతం, జగిత్యాల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వయోవృద్ధుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా, స్థానిక టి.ఆర్ నగర్‌లో 1.25 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ వయోవృద్ధుల సదనాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి ఘనంగా ప్రారంభించారు. వృద్ధ ఆశ్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మహిళలు బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రణం డే...