navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 8:37 am Digital Edition : NAVA GEETAM

వరద నీటిలో చిక్కుకున్న బ్రిడ్జి నిర్మాణం 

163 వ జాతీయ రహదారిపై నిలిచిపోయిన పనులు.

ములుగు,సెప్టెంబర్ 26,(నవగీతం)

ములుగు జిల్లా వాజేడు మండలంలోనీ చీకుపల్లి ఇసుకవాగు వద్ద గోదావరి వరద వలన రహదారి పూర్తిగా నిర్బంధానికి గురి అయ్యింది.గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు మండలాల్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
తాజాగా వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరింది.

బ్రిడ్జి పిల్లర్ల నిర్మాణం కోసం తవ్విన గుంతలు,వేసిన ర్యాంపులు పూర్తిగా నీట మునిగాయి.నిర్మాణ సామాగ్రి అయిన సెంట్రింగ్ ప్లేట్లు,ఇనుప రాడ్లు నీటిలో చిక్కుకుపోయాయి.

ఫోటోలో కనిపిస్తున్నట్లుగా జేసిబి నీటిలోనే ఉండి సామాగ్రిని బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది. బురదమయంగా మారిన రహదారి కారణంగా టిప్పర్ లారీ ముందుకు కదలలేక మొరాయిస్తోంది. కార్మికులు మోకాళ్ల లోతు నీటిలోనే పనులు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యవలన 163 వ జాతీయ రహదారి పై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.
వర్షాకాలం దృష్ట్యా నిర్మాణ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వరద తగ్గిన వెంటనే పనులు వేగవంతం చేసి ప్రజలకు రాకపోకల ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక ప్రజలు సంబంధిత శాఖ అధికారులను, కాంట్రాక్టర్ ను కోరుతున్నారు.