వరద నీటిలో చిక్కుకున్న బ్రిడ్జి నిర్మాణం 

163 వ జాతీయ రహదారిపై నిలిచిపోయిన పనులు. ములుగు,సెప్టెంబర్ 26,(నవగీతం) ములుగు జిల్లా వాజేడు మండలంలోనీ చీకుపల్లి ఇసుకవాగు వద్ద గోదావరి వరద వలన రహదారి పూర్తిగా నిర్బంధానికి గురి అయ్యింది.గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు మండలాల్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.తాజాగా వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరింది. బ్రిడ్జి పిల్లర్ల నిర్మాణం కోసం తవ్విన గుంతలు,వేసిన ర్యాంపులు పూర్తిగా నీట మునిగాయి.నిర్మాణ సామాగ్రి అయిన సెంట్రింగ్ ప్లేట్లు,ఇనుప రాడ్లు...