navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 2:47 pm Digital Edition : NAVAGEETAM

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి…తహసిల్దార్ వరప్రసాద్

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం తాహసిల్దార్ వరప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాహసిల్దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ వరప్రసాద్ మాట్లాడుతు రైతులు కొనుగోలు కేంద్రం లో ధాన్యాన్ని అమ్మి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ పి ఓ చైర్మన్ కుంభాల రాజిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలాల వెంకటరెడ్డి, సర్పంచ్ పుప్పాల లక్ష్మి మహేష్, ఉపసర్పంచ్ రాపల్లి మహేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూస రాజేశ్వర్, వార్డు సభ్యులు బైండ్ల విశాల్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.