వరి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

ఆకస్మిక తనిఖీల్లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశాలు నవగీతం,జగిత్యాల ప్రతినిధి : జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం బీర్పూర్ మండలంలోని చర్లపల్లి, నరసింహులపల్లి, కందెనకుంట, తుంగూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు...