వరి ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలి:

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి: ఇబ్రహీంపట్నం మండల కేంద్రం మండల పరిధిలోని గోదూరు, తిమ్మాపూర్ తాండ, వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను...