పిల్లలకు పోలియో చుక్కలు వేసిన సర్పంచ్
నవగీతం , ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ వైద్య సిబ్బంది పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం అత్యంత విజయవంతంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొనుకంటి చిన్న వెంకట్,ముఖ్య అతిధిగా హాజరై చిన్నారులకు స్వయంగా పోలియో రెండు చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పొనుకంటి వెంకట్ మాట్లాడుతూ. ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన పోలియో నిర్ములన కార్యక్రమంలో భాగంగా పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు ఆరోగ్య రక్షణ కల్పించాలని కోరారు. గ్రామంలో ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేసుకోకుండా ఉండిపోకూడదనే ఉద్దేశ్యంతో వైద్య సిబ్బంది కష్టపడుతున్నట్లు కొనియాడారు.ఈ శిబిరనికి స్థానిక తల్లులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ వైద్య శిబిరంలో ఉపసర్పంచ్ తుమ్మల జయ, ఎం.ఎల్.హెచ్.పి గణేష్,ఏ.ఎన్.ఎం భవాని, ఆశా వర్కర్లు తుమ్మల ప్రమీల, వినోద, వనిత, సి ఏ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.