navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 9:31 pm Digital Edition : NAVAGEETAM

వాగ్దేవి పాఠశాల కరపత్రం ఆవిష్కరణ

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

మెట్‌పల్లి పట్టణంలోని ఆరపేటలో గల వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాల కరపత్రాన్ని మున్సిపల్ చైర్మన్ లింబాద్రి , మెట్‌పల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాంబాబు ఆవిష్కరించారు. విద్యా రంగంలో వాగ్దేవి పాఠశాల అందిస్తున్న సేవలను అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణను అందించడంలో యాజమాన్యం తీసుకుంటున్న చొరవ ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ముక్క నరేష్ కుమార్, పుప్పాల నవీన్ కుమార్, నల్ల గోపి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మరిన్ని మెరుగైన వసతులు, విద్యా ప్రమాణాలు కల్పిస్తామని ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు తెలియజేశారు.