విజయవంతమైన ఉచిత మహిళ ఆరోగ్య వైద్య శిబిరం

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో నిర్వహించిన ఉచిత మహిళ ఆరోగ్య వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు ఆధ్వర్యంలో హైదరాబాదులోని కొంపల్లికి చెందిన అవ్ని బర్త్ నెస్ట్ ఆస్పత్రి నిర్వాహకులు, సీనియర్ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ కన్సల్టెంట్ వైద్యులు హేమారెడ్డి, మెట్ పల్లిలోని శ్రీలక్ష్మి ఆస్పత్రి వైద్యులు మాధురి హాజరై మహిళలకు వైద్య సేవలు అందించారు. గైనకాలజీ విభాగంలో ఉచిత వైద్య పరీక్షలు చేశారు....