విద్యతోనే ఉన్నత భవిష్యత్తు :వైరా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ
ఎనిమిదో వార్డులో మెరిసిన ఆణిముత్యాలు నవగీతం,వైరా ప్రతినిధి: వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో మెరిసిన ఆణిముత్యాలు అని పదో తరగతిలో 500 పైగా మార్పులు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి వైరా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ, వైరా ఎస్సై పుష్పాల రామారావు పేర్కొన్నారు. శుక్రవారం బ్రాహ్మణపల్లి అగ్రహారం ఎనిమిదో వార్డులో ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో 500 మార్కులు పైగా సాధించిన విద్యార్థులను ప్రోత్సహించే నేపథ్యంలో 8వ వార్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కౌన్సిలర్ చిలకా చిన్న...