విద్యను కొనసాగించటానికి మెట్ పల్లి డిగ్రీ కళాశాలలోనే చేరండి : ప్రిన్సిపాల్

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: ఇంటర్మీడియట్ తో పాటు తత్సమాన అర్హత గల విద్యార్థులు తమ విద్యను నిరాటంకంగా కొనసాగించటానికి మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చేరాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గురువారం రోజున "దోస్త్" అడ్మిషన్ల కోసం ప్రిన్సిపాల్ అధ్వర్యంలో ప్రచార కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్, వొకేషనల్ కోర్సులు,"ఓపెన్ ఇంటర్" తో పాటు మధ్యలో విద్యను ఆపేసిన (డ్రాప్అవుట్) విద్యార్థులందరూ విధిగా తమ విద్యను కొనసాగించటానికి...