మల్లాపూర్,ఆగస్టు18,(నవగీతం):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు,నోట్‌బుక్స్, యూనిఫామ్,స్కూల్ బ్యాగులు,షూస్‌తో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తోంది.ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులకు ఒక్కొక్కరికి 12 నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. వీటి విలువ సుమారు రూ.650 ఉంటుందని తెలిపారు.ఇప్పటికే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందించినట్లు పేర్కొన్నారు.పేద,మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందించడం అభినందనీయమని తెలిపారు. అదేవిధంగా రానున్న రెండు,మూడు రోజుల్లో ప్రతి విద్యార్థికి స్కూల్ బ్యాగులు,షూస్ కూడా అందజేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణ, అధ్యాపకులు నంచర్ల రాజేష్, సంతోష్, శ్రీనివాస్, మహేష్, రాజేందర్, రజిత తదితరులు పాల్గొన్నారు.